||చిత్ర కళకు కేరాఫ్ పల్లం పిచ్చయ్య||
,(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
శ్రీశ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని బుద్ధాల కన్వెన్షన్ హాలులో 30 గంటల 30 నిమిషాల 30 సెకండ్ల పాటు జరిగిన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాత్కాలిక చిత్రకళ ఉపాధ్యాయుడిగా తెలంగాణ బుక్ ఆఫ్ బుక్కు చెందిన ముద్దుబిడ్డ పల్లం పిచ్చయ్య అమేజింగ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ (టీఎస్ ఏ బుక్ ఆఫ్) ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ రికార్డ్ ఆఫ్ రికార్డ్, కల్చరల్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డులలో పల్లం పిచ్చయ్య పేరు నమోదు చేసినట్లు ధృవీకరిస్తూ శ్రీశ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శాలువా జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పల్లం పిచ్చయ్య పాల్గొని”కళాకారుడి పై వేదన”అనే అంశంపై కవితలు అద్భుతంగా చదివి ఐఎస్ఓ గుర్తింపు పొందిన ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ అయిన శ్రీ శ్రీ కళావేదిక ద్వారా తన పేరు నమోదు చేసుకున్నారు తాత్కాలిక చిత్ర కళ
ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కథలు చదవడం కవితలు రాయడం వ్యాపకంగా చేసుకొని కవులు రచించిన కవితలకు తగినట్లుగా చిత్రాలు వేయడం ద్వారా ప్రసిద్ధి పొందారు. ఎందరో సాహితీ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడంతో పాటు గతంలో చిత్రకారులుగా వివిధ సాహితీ సంస్థలు చిత్రకళా వేదికలపై చిత్రకళారత్నం చిత్రకళా శేఖర చిత్రకళా సేవారత్న చిత్రకళ వల్లభా బిరుదులతో పాటు ఆంధ్రప్రదేశ్ విజయవాడ అక్కినేని నాగేశ్వరరావు కళాక్షేత్రంలో నట వారిచే నంది అవార్డుతో సన్మానం చేయడంతో పాటు సన్మాన కార్యక్రమాలలో నటా వారిచే అందజేయబడిన 50 సన్మానాలు జరిగాయి. వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్లంపిచ్చయ్య వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న నేపథ్యంలో సృజన సాహితీ వేదిక నిర్వాహకులు గార్లపాటి రామకృష్ణ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు బొల్లేపల్లి మధుసూదన రాజు, విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపాల్ పసుపులేటి నాగేశ్వరరావు, గట్టే వాసు, లైవ్ స్వచ్ఛంద సంస్థ గండ్ర కిషోర్ కుమార్ రెడ్డి తేళ్ళూరి అగ్రశ్రేణి సంస్థ గండ్ర కిషోర్ కుమార్ రెడ్డి తేళ్ళూరి నవరస కళాపరిషత్ నిర్వాహకులు రాంబాబు రెడ్డి. నర్సింగరావు చేపట్టిన పల్లం పిచ్చయ్యకు అభినందనలు తెలిపారు.,