అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ అధికారులు కోర్టులో మరో చార్జిషీటు దాఖలు చేశారు. ఈసారి పైబర్ నెట్ కేసులో బాబును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ ఐపీసీ 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌విత్ 120బి ప్రెవెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం 13(2), రెడ్‌విత్ 13(1)(సీ)(సీ) కేసు నమోదు చేశారు. సంబంధిత చార్జిషీటును (నిన్న) శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఫైబర్‌నెట్ మొదటిదశలో కుంభకోణం తెలిసింది.