ముద్ర,ఆంధ్రప్రదేశ్:- విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకు సీటు దక్కడం ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా పవన్ కల్యాణ్ పై కీలక విమర్శలు చేశారు.తన అనుచరులతో కలసి వైఎస్ జగన్ బస చేసిన గంటావారిపాలెం వద్దకు వెళ్లిన మహేష్ వైసీపీలో చేరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా మహేష్ తెలిపారు.