ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లోగా వివరణ అందించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు.