ముద్ర,ఆంధ్రప్రదేశ్:- నిన్న ఎన్నికల ప్రచారం సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన విషయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే.. ఈ దాడి వెనక ఉన్నది టీడీపీ నేతలేనని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే.. సానుభూతి కోసమే ఈ దాడి వైసీపీ నేతలే చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా కూడా ఇదే తరహాలో జరిగిందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ దాడి వైసీపీ డ్రామా అంటూ ఆయన పరోక్షంగా కామెంట్స్ చేశారు.
రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా!
కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్! @వైఎస్ జగన్ #కోడికత్తి డ్రామా2 #ఆంధ్రప్రదేశ్ pic.twitter.com/PFbknSy9sg
– లోకేష్ నారా (@naralokesh) ఏప్రిల్ 13, 2024