విజయవాడ – ఈవార్తలు న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అనే యువకుడిని, అతడితో పాటు నలుగురు స్నేహితులను అరెస్టు చేశారు. నిందితుడు సతీష్ కుమార్ అలియాస్ సత్తి అని సమాచారం. ఫుట్‌పాత్ కోసం వేసే టైల్స్ రాయితో జగన్‌పై దాడి చేసినట్లు తెలిసింది. సతీష్‌తో పాటు ఆకాశ్, దుర్గారావు, చిన్నా, సంతోష్‌ను అదుపులోకి తీసుకుని వారి ఇంటి వద్ద సిట్ అధికారులు విచారణ చేపట్టారు. కాగా, నిందితులను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు అందజేస్తామని ఇదివరకే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వెల్లడించారు.
36
previous post