ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ 20 మంది పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్‌లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులతో స్వయంగా ప్రమాణం చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి అభ్యర్థి గెలవాలని. వలసలు లేని.. పస్తులు లేని ఏపీ ఏర్పాటు మనందరి బాధ్యతన్నారు.ప్రజలే దేవుళ్లని.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. పోలవరం పూర్తి, నదుల అనుసంధానానికి కృషి చేస్తానని కామెంట్స్ చేశారు.
విద్య, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి కంకణబుద్ధులై పనిచేస్తామన్నారు. ఎన్డీయే కూటమి గెలపునకు చిత్తశుద్ధితో కృషి చేసి భరోసా కల్పించారు. అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టాలన్నారు. అందరూ కలిసి పనిచేయాలని.. ప్రజలకు వెళ్లాలని సూచించారు. వివాదాలకు తావు లేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని.