ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధినేత, వైసీపీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మేమంతా సిద్ధం చేసిన బస్సు యాత్ర ఒకరోజు బ్రేక్ తరువాత 17వ రోజు గురువారం ప్రారంభం. బుధవారం శ్రీరామనవమి కావడంతో బస్సు యాత్రకు జగన్ బ్రేక్ ఇచ్చారు. తిరిగి గురువారం ఉదయం 9గంటలకు తణుకు వై-జక్షన్ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. రెండు జిల్లాల్లో ఆరు నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర మొత్తం 85 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. తణుకు వై-జక్షన్ నుంచి శర్మిష్ట జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్ మీదుగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలికి బస్సు యాత్ర చేరుకుంటుంది. అనంతరం సిద్ధాంతం బ్రిడ్జ్ మీదుగా కొత్తపేట నియోజకవర్గం ఈతకోటకు బస్సు యాత్ర చేరుకుంటుంది.
ఈతకోట, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక వరకు బస్సుయాత్ర సాగుతుంది. పొట్టిలంక వద్ద భోజన విరామ సమయం తీసుకుంటారు. అనంతరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంటుంది. కడిపలంక, వేమగిరి, మోరంపూడి మీదుగా బస్సుయాత్ర సాగుతుంది. మోరంపూడి నుంచి తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవీ చౌక్, పేపర్ మిల్లు సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురంకు బస్సు యాత్ర చేరుకుంటుంది. ఎస్టీ రాజాపురంలో రాత్రి సీఎం జగన్ బస చేస్తారు.