ముద్ర,ఆంధ్రప్రదేశ్- సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సతీష్‌కు వైద్య పరీక్షలు జరిగాయి. అనంతరం విజయవాడ కోర్టులో సతీష్‌ను పోలీసులు హాజరుపరిచారు. కాగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ చిత్రం. సీఎం జగన్ పై జరిగిన దాడిలో సతీష్ ఏ1గా ఉన్నాడు. ఇదే సతీష్ కు సహకరించిన దుర్గారావు సహా మరో ఐదుగురు యువకులను పోలీసులు విచారించారు.