అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతల రోడ్డులో ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం ఎదుళ్లపాలెం జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. మృతులు విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన వారిగా పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చికిత్స.