ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ ఎన్నికల సందర్బంగా.. సీఎం జగన్ మరో యాత్రకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పాల్గొననున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు మూడు ప్రచార సభల్లో జగన్ పాల్గొంటారు.28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహిస్తున్నారు.