ముద్ర,ఆంధ్రప్రదేశ్:- తూర్పుగోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మొత్తానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు.