ఏపీలో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున అధికార వైసీపీ, టీడీపీ వర్గాలకు మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ విధంగానే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల కర్రలు, రాడ్లతో దాడులకు తెగబడ్డాయి. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై అధికార పార్టీకి చెందిన పలువురు హత్యాయత్నాకి ప్రయత్నించారు. ఈ ఘటనలో నానితోపాటు ఆయన గన్‌మెన్ తీవ్రంగా గాయపడ్డారు. రాడ్లు, కర్రలతో ఆయనపై హత్యాయత్నాకి విచారణారంటూ ఫిర్యాదులు అందాయి. పోలీసులు విచారణను జోరుగా సాగించారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. నిందితులను చిత్తూరు సబ్ జైలుకు పోలీసులు విచారించారు.
పోలింగ్ మరుసటి రోజు ఘటన
చిత్తూరు జిల్లాలో పోలింగ్ అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పులవర్తి నాని వర్గీయులకు ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికలు తరువాత రోజు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్టార్టాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు పులివర్తి నాని వెళ్లారు. ఈ కోరనే వైసీపీ నాయకులు మారణాయుధాలతో ఆయనపై దాడికి తెగబడినట్లు చెబుతున్నారు. ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న నాని.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సమయంలో నన్ను సురక్షితంగా తప్పించే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. కంటి దగ్గరలో పెద్ద ఎత్తున గాయం ఏర్పడింది. నాని భద్రతా సిబ్బందికి చెందిన కారు పూర్తిగా ధ్వంసమైంది. నాని భార్య, టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇదిలా ఉంటే తనపై జరిగిన దాడి వెనుక కుట్రలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్నారంటూ నాని ఆరోపిస్తున్నారు.