ముద్ర,ఆంధ్రప్రదేశ్:- 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్ కోసం ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో 151 స్థానాలు సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.జగన్ అధికారంలోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ కు, వైఎస్ జగన్ కు మధ్య అంతరం ఏర్పడింది.అయితే తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా నేడు ఐప్యాక్ టీంతో సమావేశం అయిన జగన్, ప్రశాంత్ కిషోర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు వస్తాయని జగన్ అన్నారు. గొప్పతనమంతా ఐప్యాక్ టీందేనని ప్రశాంత్ కిషోర్ ది కాదని జగన్ అన్నారు. జగన్ కు ఓటమి తప్పదంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ మనకు అడ్డం తిరిగినా విజయాన్ని ఎవరూ ఆపలేరు. 2019 ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ తనకు 151 స్థానాలు వస్తాయని చెప్పలేకపోయారని, ఆయన గొప్పతనం ఏమీ లేదని, కేవలం జగన్ మాత్రమేనని అన్నారు. ఎంపీ సీట్లు గతంలో కంటే ఎక్కువ సాధించబోతున్నామని, అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందుతుందని ఆయన పూర్తి విశ్వాసంతో చెప్పారు