ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్ -2023కి సంబంధించిన కరువు సాయం, మిచౌంగ్ తుఫాన్ పంట నష్టపరిహారం శనివారం నుంచి రైతులు కాకల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11.57 లక్షల మంది రైతులు ఖాతాల్లోకి రూ.1,289 కోట్ల రూపాయలను ప్రభుత్వం చేయనుంది. ఇందులో ఖరీఫ్ రైతులకు సంబంధించి రూ.847 ఉండగా, మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ వేడుక చేయాలని భావించింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నిధులు విడుదల ఓటింగ్ పై ప్రభావం చూపుతుంది అన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ పూర్తికావడంతో ఈ నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటితోపాటు ఆసరా, విద్య దీవెన వంటి పథకాలకు సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆయా పథకాలకు సంబంధించిన నిధులు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం ముందుగా చెప్పినట్లు ఆయా పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయడం గమనార్ధం. నిధులు విడుదలపై లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జమవుతున్న ఆ నిధులు
గురువారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తోంది. ఇప్పటికే విద్యా దేవునికి సంబంధించిన నిధులు చాలామంది విద్యార్థుల ఖాతాలో జమయ్యాయి. కళ్యాణమస్తు, ఆసరాతోపాటు ఇతర పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేశామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రెండు మూడు రోజుల్లో లబ్ధిదారులు ఖాతాల్లో ఈ మట్టాలు జమవుతాయని అధికారులు చెబుతున్నారు.