రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణలపై విచారణకు సిట్ ఏర్పాటు అయింది. 13 మంది సభ్యులతో కూడిన సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందానికి వినీత్ బ్రిజ్ లాల్ నాయకత్వం వహించారు. ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో సిట్ విచారణ సాగనుంది. ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున గొడవలు జరగడం, వాటిని అదుపు చేయకపోవడం పట్ల ఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ ఘర్షణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా సిఎస్ ను ఏర్పాటు చేసింది.. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన హింస నాలుగు రోజులపాటు కొనసాగింది. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతిలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఈ అల్లర్లకు సంబంధించిన కేసుల విచారణ పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది. ఘర్షణలకు సంబంధించిన కుట్రలో భాగమైన కొందరు సీనియర్ రాజకీయ నేతలను కూడా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రాథమిక నివేదిక అందజేత
మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. ఇది ఎలా ఉంటే గొడవలను నియంత్రించడంలో విఫలమైన పోలీసు అధికారులు ఈసీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సిట్ విచారణ తర్వాత ఇంకెంతమందిపై యాక్షన్ ఉంటుందో అన్న ఆందోళన సర్వత్ర వ్యక్తం అవుతోంది.