- పలమనేరు అడవిలో గుర్తింపు….
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-భూమి మీద మనకు తెలియని వింతలూ, విశేషాలు ఎన్నో ఉంటాయి. అరుదైన వృక్ష, జంతుజాలానికి నిలయం భూమి. ప్రాంతానికో విశిష్టత, ఆచారం ఉన్నట్టే.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన జంతువులు ఉంటాయి.
ఆ ప్రాంత వాతావరణం, వాతావరణ పరిస్థితులను, మార్పులను తట్టుకుని నిలబడగలిగే జంటలు మనుగడ సాగిస్తుంటాయి. ఈ పోరాటంలో కొన్ని జంతువులు కనుమరుగైపోతుంటే.. అయితే కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ జీవిస్తుంటాయి. అలా కనుమరుగైపోతున్న వాటినే అరుదైనవి అని పిలుస్తుంటారు. తాజాగా చిత్తూరు జిల్లాలో అరుదైన బంగారు కప్ప కనిపించింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కనుమరుగైన అరుదైన జాతి కప్పను పరిశోధకులు చిత్తూరు జిల్లాలో పేర్కొన్నారు.