ముద్ర,ఆంధ్రప్రదేశ్:- నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని చెరువులో పురిటి బిడ్డ మృతదేహం లభ్యమైంది. ఉదయం చెరువు వద్దకు వెళ్లిన స్థానికులకు మృతదేహం కనపడడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత బిడ్డ మృతి చెందడంతో ఆ బిడ్డను ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు తెలిపారు.
ఉదయగిరి ప్రాంతంలోని ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీలకు సంబంధించి పోలీసులు సేకరిస్తున్నారు. తయారు చేసిన పురిటి బిడ్డ మృతదేహాన్ని పడేశారా.. లేక బతికుండగానే పడేసారా.. అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పురిటిబిడ్డ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు గుర్తించారు.