జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబుపై మాజీ జనసేన నాయకుడు, ప్రస్తుత వైసీపీ లీడర్ పోయిన మహేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ నాగబాబు చేసిన ట్వీట్ వివాదం గురించి తెలిసిందే. నాగబాబు చేసిన ఈ ట్వీట్ పై ఇప్పటికే పెద్ద రచ్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకుడు పోతిన మహేష్ నాగబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగుపాముకి పాలు పోసిన అది కాటు వేస్తుందని, నాగబాబు కూడా అలాంటి వాడే అని పోతిన మహేష్. వాడుకుని వారితో స్నేహం, నమ్మకంగా ఉంటే వారి విలువ అసలు తెలుస్తుందా..? అంటూ చురకలు అంటించారు. సహాయం చేసిన వారిపట్ల కృతజ్ఞతా భావంతో మెగా కుటుంబం ఉండదని మహేష్ వ్యక్తి. నాగబాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ ఎంతగానో సహకరించారని, నా పేరు సూర్య సినిమాకి ప్రొడ్యూసర్‌గా పెట్టించి మూడు కోట్ల రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు. మరో రెండు, మూడు సినిమాల్లో అవకాశాలు కూడా నాగబాబుకు అల్లు అర్జున్ అందించిన తర్వాత మహేష్ గుర్తు చేశారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ జనసేనకు రెండు కోట్ల రూపాయలు నిధులు కూడా అందించాడని, అయినా అల్లు పై నాగబాబు విషం చిమ్మడం సిగ్గుచేటని అర్జున్. మెగా కుటుంబానికి అండగా నిలిచిన గీత ఆర్ట్స్ పైనే నాగబాబు తన కుళ్ళు, కుతంత్రాలను వ్యక్తం చేయడం దారుణం అన్నారు. మెగా ఫ్యామిలీ ఒక దగా ఫ్యామిలీ అని పోతిన మహేష్ విరుచుకుపడ్డారు. మరోవైపు అల్లు అర్జున్ పై నాగబాబు చేసిన ట్వీట్ పై ఆయన అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగబాబుకు మంచి, మర్యాద తెలియదంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఆ ట్వీట్ ను తొలగించారు రచ్చ మాత్రం కొనసాగుతోంది. ఏది ఏమైనా రాజకీయాల కేంద్రంగా జరుగుతున్న రచ్చ మెగా ఫ్యామిలీని బజారుకీడ్చినట్లు అయిందని వాపోతున్నారు.