రాష్ట్రంలో సార్వత్రిక పోలింగ్ అనంతరం జరిగిన గొడవలను తమ పార్టీపై పెట్టేందుకు టిడిపి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన టిడిపి వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చంద్రబాబు ఓటమితో ఒత్తిడికి గురై దాడులను ప్రేరేపిస్తున్నారని తెలిపారు. టిడిపి నాయకులే దాడులకు తెగబడి, కుట్ర పూరితంగా వైసిపిపై తప్పుడు ఆరోపణలు ఉన్నాయని, దానికి తోడు పప్పు లోకేష్ ఆరోపణలు చేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నాడని పెద్దిరెడ్డి తెలిపారు. జూన్ నాలుగో తేదీ తర్వాత ఫలితాలను చూసి టిడిపి నాయకులు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూస్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హస్తంలో మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేని వ్యక్తి తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా. తమ కుటుంబం వ్యాపారాలు చేస్తూనే రాజకీయాలు సాగిస్తున్నామని, 2013 నుంచి ఆఫ్రికాలో వ్యాపారాలు చేస్తున్నామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఫెర్రో మాంగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఇక్కడ నుంచి వాహనాలు, మిషనరీస్ అక్కడకు పంపిస్తున్నామని చెప్పారు. వైసిపి నాయకులు విదేశాలకు పారిపోతున్నారంటూ తప్పుడు ప్రచారాలు ఉన్నాయి పెద్దిరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ పాలనను కోరుకుంటున్నారని, మెజారిటీ స్థానాల్లో వైసిపి గెలవబోతోందని స్పష్టం చేశారు. టిడిపికి భయపడే ప్రసక్తే లేదని, తాను విద్యార్థి దశ నుంచే చంద్రబాబుతో పోటీ పడుతున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం హింసను టిడిపి నాయకులే ప్రోత్సహించారని, అనేక చోట్ల గొడవలకు కారణమయ్యారని పెద్దిరెడ్డి. మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి తరపున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని, ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందించబోతున్నామని చెప్పారు. వైసిపి నాయకులపై కుట్రపూరిత ఆరోపణలకు టిడిపి ఇప్పటికైనా స్వస్తి పలకాలని ఆయన సూచించారు. టిడిపికి అనుకూలంగా వ్యవహరించే పచ్చ పత్రికలు పిచ్చి రాతలు రాస్తున్నాయని, ఈ తరహా విధానంలో మార్పు రావాలని స్పష్టం చేశారు.