వైద్య ఖర్చుల కోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ లో చేసే ఆటో క్లైమ్ సెటిల్మెంట్ పరిమితిని పెంచుతూ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ ఓ) నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌లో చేసే ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 50 వేల నుంచి లక్ష వరకు పెంచింది. మానవ ప్రమేయం లేకుండా వేగంగా ఆటో సెటిల్మెంట్ ద్వారా మూడు నుంచి నాలుగు రోజుల్లోనే ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ప్రక్రియను సులభతరం చేసినట్లు ఈపీఎఫ్ఓ. ఈ ప్రక్రియ పూర్తవడానికి గతంలో పది రోజులు సమయం పట్టేది. దీనివల్ల బంధువులు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సకాలంలో వైద్య సేవలకు ఆర్థిక మొత్తాలు అందక అప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. తాజాగా మార్చిన ప్రక్రియ వల్ల మూడు నుంచి నాలుగు రోజుల్లోనే జమ. విద్య, వివాహం కోసం రూల్ 68K ప్రకారం ఈపీఎఫ్వోలో చేరి ఏడేళ్లు, ఇంటి కోసమైతే 68B ప్రకారం ఐదేళ్లు పూర్తయ్యాకే లక్ష విత్ డ్రా చేసుకోవాలి. వైద్యం కోసం అయితే ఎప్పుడైనా తీసుకున్న వెసులుబాటును ఈపీఎఫ్ఓ కల్పించింది. తాజా నిర్ణయం వల్ల వేలాది మంది అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మేలు చేకూరనుంది.