ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేయడానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సమ్మె నోటీసులు అందించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షాకు రాసిన లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని గురించి ప్రస్తావించారు. ఈ నెల 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అదనంగా ఆగస్టు నుంచి ఉన్న 150 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసిన అసోసియేషన్. పలుమార్లు లేఖలు రాసిన ఇప్పటి వరకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే బిల్లు చెల్లించినట్లు, కోట్లాది రూపాయల పెండింగ్‌తో ఆస్పత్రుల నిర్వహణ ఇబ్బందిగా మారుతోందని అసోసియేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న బకాయిలు మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. పెండింగ్ బకాయిలు విడుదల చేసేంత వరకు సేవలను అందించబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ఆసుపత్రి అసోసియేషన్ సమ్మె నోటీసు ఇవ్వడం ఇది మూడోసారి జరగడం లేదు. గతంలోనూ రెండు సార్లు సమ్మె నోటీసులు ఇవ్వగా ప్రభుత్వం స్పందించి కొంత మొత్తం చొప్పున విడుదల చేయడంతో ఆసుపత్రి అసోసియేషన్ సమయం నుంచి వెనక్కి తగ్గింది. కానీ ఈసారి పూర్తిస్థాయి బకాయిలను విడుదల చేస్తే సేవలు అందించబోమని స్పష్టం చేశారు.