మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు.. కొన్ని ఆంక్షలను కూడా ఆయనపై విధించింది. ఓట్ల లెక్కింపు రోజు మాచర్లకు వెళ్ళడానికి హైకోర్టు ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని స్పష్టం చేసింది. వచ్చేనెల 6 వరకు లోక్సభ నియోజకవర్గం ఉండాలని హైకోర్టు పిన్నెల్లికి సూచించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని, సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేసింది. పిల్లి రామకృష్ణారెడ్డి కదలకల పై పూర్తిస్థాయి నిగా ఉంచాలని ఉన్నత న్యాయస్థానం.. ఈ మేరకు సీఈవో, పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాల్వాయి గేటు పోలింగ్ ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. పోలీసులు అరెస్టు చేస్తారని ఉద్దేశంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడ నుంచే హైకోర్టు ఆశ్రయించిన ఆయన.. ముందస్తు బెయిల్ పొంది ఉపశమనం పొందారు. అయితే మాచర్లకు వెళ్లకూడదన్న ఆంక్షలతో ఆయన అనుచరులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.