ప్రపంచ వ్యాప్తంగా అనేక కేన్సర్లు పడగ విప్పుతున్నాయి. ఏటా కొన్ని లక్షల మంది కేన్సర్ బారినపడి మృత్యువాత పడుతున్నారు. కొన్ని కేన్సర్ల బారిన ఎందుకు పడతారో చాలా మందికి తెలియదు. ఎక్కువ కేన్సర్లు మాత్రం స్వీయ తప్పిదాలు వల్లే వస్తుంటాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానాలలో మార్పులు, దురలవాట్లు కారణంగా ఎంతో మంది కేన్సర్లకు ఉంటాయి. అయితే, టాటూ వేసుకోవడం వల్ల కూడా కేన్సర్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాటూతో బ్లడ్ కేన్సర్ ముప్పు ఉందని, శరీరంపై వేసుకునే టాటూలతో లింఫోమా అనే బ్లడ్ కేన్సర్ వచ్చే ముప్పు 21 శాతం వరకు ఉంటుంది. ఈ పరిశోధనలో భాగంగా లింఫోమా బ్లడ్ కేన్సర్ బారిన పడిన 2,938 మందితో కలిపి మొత్తంగా 11,905 మందిపై ఈ అధ్యయాన్ని చేశారు. వేసుకున్న వారిలో కెన్సర్ కండల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు సూచిస్తున్నారు. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, మరింత లోతైన పరిశోధనను సాగిస్తున్నారు. ముఖ్యంగా స్పెషల్ అక్షన్లు ఎక్కువగా టాటూలు వేయించుకుంటున్న యువత ఆలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
39