ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా అదుపుతప్పి ప్రవర్తిస్తే అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ కౌంటింగ్ ప్రక్రియను నిర్ధారించారు. ఇప్పటికే సిఆర్పిఎఫ్ బలగాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నాయని వివరించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు కూడా చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్టాత్మక బందోబస్తు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఏ పార్టీ గెలిచిన విజయోత్సవ వేడుకలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేశామని, రెచ్చగొట్టేలా ఎవరు వ్యవహరించకూడదని. కౌంటింగ్ నిర్వహించేందుకు అనుగుణమైన ఏర్పాట్లు పూర్తిచేశామన్న ఆయన.. జిల్లాల వారిగా సమీక్షలు జరిగాయి. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఫలితాల తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ అధికారుల హెచ్చరిక నేపథ్యంలో.. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిసారించి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని, కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.