ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో తొలి విజయం ఖరారైంది. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఏకంగా 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఇప్పటినుంచి వరుసగా ఫలితాలు వెల్లడి కానున్నాయి. గోరంట్లకు 63,056 ఓట్ల మెజారిటీ వచ్చినట్లు తెలిసింది. ఇక ఆంధ్రాలో కూటమి స్వీప్ చేసిందనే చెప్పాలి.
ఇప్పటి వరకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం.. టీడీపీ 130 స్థానాల్లో, జనసేన 19, బీజేపీ 6 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. వైసీపీ కేవలం 20 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేసిన నారాలోకేష్, హిందూపూర్ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణలు సైతం విజయం వైపు పయనిస్తున్నారు.