ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఎపిలోని 25 లోక్ సభ స్థానాలకు బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది… టిడిపి 15 స్థానాల్లో , వైసిపి 4 చోట్ల మందంజలో ఉన్నాయి.. జనసేన 2, బిజెపి 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి..
రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి లీడ్ 617 ఓట్ల ఆధిక్యంలో పురంధేశ్వరి
నంద్యాల సాక్షి బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో మొదటి రౌండులో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి 113 ఓట్ల ఆదిక్యతతో ముందంజలో ఉన్నారు.
గుంటూరు తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజ
నరసరావుపేట పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు ముందంజలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 3447 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు…. మొత్తంగా లావుకు 20721 ఓట్లు, అనిల్ కు 17274ఓట్లు పోలయ్యాయి..
బాపట్ల రెండవ రౌండ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థికి 11984 వైసీపీ అభ్యర్థి నందిగామ సురేష్8928
విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కే. అప్పలనాయుడు మొదటి రౌండులో స్వల్ప అధిక్యం
శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 27,618 ఓట్ల అధిక్యం
ఇక కడప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి సైతం వెనుక బడ్డారు. కూటమి అభ్యర్థి భూపేశ్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు.