ముద్ర,ఆంధ్రప్రదేశ్:- తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీటీవీలను ఏర్పాటు చేయలేదని, తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని, తన కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని, తనకు 8 చోట్ల సున్నా ఓట్లు పడ్డాయని చెప్పారు. కోర్టుకెళతానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.