ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ తరపున కూటమి ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని గతంలో ఉన్న ధరలకు అందిస్తామని స్పష్టం చేసింది. చెప్పినట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల ముందు చెప్పినట్టుగానే మద్యం పాలసీపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సీఎంవోలో మద్యం పాలపై వాడి, వేడి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న నూతన మద్యం పాలసీకి సంబంధించిన విడుదలనున్నట్టు సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్న నూతన ప్రభుత్వం.. కొత్త పాలసీని తీసుకురానుంది. ఇప్పుడున్న డిస్టలరీస్‌ని రద్దు చేసి, కొత్త పాలసీని తీసుకురానుంది. రూరల్ టెండర్ ప్రాంతంలో ఒక షాప్ ఏర్పాటు చేసేందుకు రూ.45 వేలు, నగర పరిధిలో అయితే రూ.55 వేలు చొప్పున డిపాజిట్ చేయాల్సిన విధి, విధానాలు ఉన్నాయి. డిపాజిట్ చేసిన మొత్తం తిరిగి చెల్లించారు. కల్తీ లేని మద్యాన్ని తిరిగి పాత బ్రాండ్‌లను వినియోగదారులకు అందించేలా మార్పులు తీసుకురానున్నారు. గత ప్రభుత్వంలో ఊరు, పేరు లేని డిస్టలరీస్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఇష్టరాజ్యంగా దోపిడీ చేశారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వం జరుగుతుందని సీఎంవోలని అధికారులు విచారణ చేస్తున్నారు.