ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగానే తనకు మద్ధతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గవర్నర్‌కు అందించారు. చంద్రబాబు, గవర్నర్ కొద్ది సేపు పలు విషయాలపై మాట్లాడారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. లేకపోతే, బుధవారం 11.27 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.