రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న హింస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని విజయసారెడ్డి నివాసంలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీల సమావేశం బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ సాయి రెడ్డి కీలక అంశాలను పరిశీలించారు. రాష్ట్రంలో టిడిపి చేస్తున్న అకృత్యాలను వైఎస్ఆర్‌సిపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అత్యంత భయానక పరిస్థితులు ఉన్నాయి. తమపైనే దాడులు చేస్తూ, తాము దాడులు నిర్వహిస్తున్నారని, చంద్రబాబు పాలన ఆటవిక పరిపాలన మాదిరిగా ఉందని. వీడియో దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని, టిడిపి నేతలు, గూండాలు చేస్తున్న దాడులు గురించి తెలుస్తున్నాయని. దాడుల్లో గాయపడి ఫిర్యాదు చేస్తున్నా సరే కేసు తీసుకోవడానికి పోలీసులు భయపడే పరిస్థితి నెలకొందని. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత కూడా వైసీపీ శ్రేణులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని. టిడిపి ప్రభుత్వం అంటే గుండ గిరి అన్నట్టుగా తయారైందని, ఈ తరహా దాడులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారం తరువాత జరిగే హింసకు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టే హింసకు తెరలేపారని విజయసాయిరెడ్డి ప్రకటన రాష్ట్రంలో జరిగిన హింస చంద్రబాబు, లోకేష్ సృష్టించిన రక్త చరిత్రగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 1999, 2014, 2024 ఎన్నికల్లో బిజెపి వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. నోరు ఎత్తలేని మధ్య తరగతి, దిగువ తరగతుల జనంపై టిడిపి చేస్తున్న దాడులు హేయమైనవని అభివర్ణించారు. బీసీలను కూడా వదలడం లేదని, తమ వ్యతిరేకులను వెతికి పట్టుకొని దాడులు చేసి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారన్నారు. బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ తగలబెడుతోందని. బిజెపిలో, జనసేన కూడా మీరు కూటమి అని, రాష్ట్రంలో జరిగే హింసకు కూడా బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. చివరకు టీవీ9, ఎన్టీవీ, సాక్షి సహా మీడియా ప్రసారాలను అడ్డుకుంటున్నారని, కేబులు ఆపరేటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. 27 సంఘటనలను లిస్టు చేసి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి నివేదిక రూపంలో పంపించినట్లు విజయసాయిరెడ్డి ఏర్పాటు చేశారు. పార్లమెంట్ లో టిడిపికి 16 మంది ఎంపీలు ఉంటే, వైఎస్సార్సీపీకి పదిహేను మంది ఉన్నట్లు గుర్తించాలని, బిజెపికి బిల్లులు పాస్ కావాలంటే తమ మద్దతు కూడా అనివార్యమన్నారు. రాష్ట్రంలో ఓటమిపాలైనప్పటికీ పార్లమెంట్ లో తమ బలం టిడిపితో దాదాపు సమానంగా ఉందని స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బిల్లుల విషయంలో తమ నిర్ణయాలు ఉంటాయి. అంశాలు వారీగా ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని, అంతేతప్ప బిజెపికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉంటుందన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి అన్నారు. కానీ తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం సరికాదన్నారు. మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఈ తరహా దాడులకు పాల్పడ్డారని, మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదే ప్రారంభమైందని అన్నారు. టిడిపి దాడులను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, మరికొందరు దాడుల్లో మృత్యువాత చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూడడం దారుణమన్నారు.