ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వచ్చిన ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. చంద్రబాబుతో పాటు పలువురు మోడీకి ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో సభాస్థలి వద్దకు మోడీ, చంద్రబాబు చేరుకోనున్నారు. ఇప్పటికే కేసరపల్లిలోని సభా స్థలికి ప్రముఖులు చేరుకున్నారు.