రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని, ఇక ప్రక్షాళన జరగాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల వెంకటేశ్వర స్వామి తన కులదైవం అన్న చంద్రబాబు.. తాను ఏ సంకల్పం తీసుకున్న ముందు శ్రీవారిని దర్శించుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఇంతటి ఘనవిజయాన్ని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. గతంలో తనపై క్లోమోర్ దాడి జరిగినప్పుడు స్వామివారే తనను రక్షించారని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చంద్రబాబు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని, సంపద సృష్టించడమే కాకుండా అది పేదలకు అందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు నుండి అన్నదానం కోసం విరాళం ఇస్తున్నానని, పేదరికం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తున్నానని చంద్రబాబు. మంచివారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అదే సమయంలో చెడ్డవారిని శిక్షించాల్సి ఉంది. రాష్ట్రంలో పరదాలు కట్టే అలవాటు ఇంకా పోలేదని, ఈ తరహా విధానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో ఏపీ కీలకపాత్ర పోషించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్న చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. తిరుపతి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని. స్వామివారిని కుటుంబ సమేతంగా చంద్రబాబు దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి చంద్రబాబు వెళ్లారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు.