విజయవాడ, ఈవార్తలు : ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేమ్ పృథ్వీరాజ్‌కు షాక్ తగిలింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలని పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి ఆయనపై ఫ్యామిలీ కోర్టులో కేసు వేయగా, కోర్టు ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టుకు హాజరు కాకపోవటంపై ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి పృథ్వీరాజ్‌పై చర్యలకు పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పృథ్వీరాజ్‌కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పెళ్లైంది. మనస్పర్థలు రావటంతో విడివిడిగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, భర్త నుంచి తనకు నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలని 2017లో శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించింది.పృథ్వీరాజ్ సినిమాలు, టీవీ సీరియళ్లు చేస్తూ నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడని పేర్కొంది. దీంతో కోర్టు నెలకు రూ.8 లక్షల భరణంతో పాటు, కోర్టు ఖర్చులు కూడా పృథ్వీరాజే భరించాలని తీర్పు ఇచ్చింది. దాన్ని పృథ్వీరాజ్ హైకోర్టులో సవాల్ చేయడంతో.. నెలకు రూ.22 వేలు చెల్లించాలని, బకాయిలు కూడా చెల్లించాలని ఆదేశించింది. అయితే, హైకోర్టును పృథ్వీరాజ్ పట్టించుకోలేదు. , కోర్టుకు కూడా హాజరు కావటం లేదని శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.
16