ముద్ర,ఆంధ్రప్రదేశ్:-కృష్ణాజిల్లా కృతివెన్ను మండలం శీతనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. శీతన పల్లి వద్ద హైవే పై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు లారీల డ్రైవర్లతో పాటు నలుగురు అందులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వస్తుండగా, మరొకటి పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వస్తుంది.
రెండు లారీలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు, మరొకరి ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో మరణించారు. మృతుల్లో ఐదుగురు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీలో మొత్తం పది మంది ప్రయాణికులు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించారు. రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ స్థంభించింది. రెండు ప్రాంతాల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు