రుషికొండపై అత్యంత ఇష్టంగా రూ.500 కోట్లతో నిర్మించిన భవనంలోకి అడుగుపెట్టకుండానే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆదివారం మధ్యాహ్నం రుషికొండపై నిర్మించిన భవనాన్ని మీడియా ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 కోట్ల రూపాయలతో అత్యంత రహస్యంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. రాజులు, సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు కట్టుకున్న రీతిలో ఈ భవన నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారన్నారు. ఇష్టంతో కట్టుకున్న ఈ భవనాన్ని చూడకుండానే జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని, మూడో కంటికి తెలియకుండా పర్యాటక శాఖ మంత్రితో ప్రారంభోత్సవం నిర్వహించడం. ఏడు బ్లాకుల్లో ఈ నిర్మాణం సాగిందని, వీటికి కూడా రాజస్థానాలు వంటి పేర్లు పెట్టబడ్డాయి. వైసీపీ నాయకులకి ఈ భవన నిర్మాణానికి సంబంధించిన పలు పనులను అప్పగించారని. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే రాజధాని ప్రాంతంలోని ప్రజా వేదికను కూల్చివేశారని, నిబంధనలకు విరుద్ధంగా కట్టడం వందడం వల్లే కూల్చివేసినట్లు నాడు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మరి రుషికొండపై కఠిన ఈ నిర్మాణానికి ఎటువంటి నిబంధనలు లేవని, ఈ నిర్మాణాన్ని ఏం చేయాలని గంట శ్రీనివాసరావు ప్రశ్నించారు. హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టింది. సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి ఈ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలని దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. హోటల్‌గా వినియోగించుకునేందుకు కూడా అవకాశం లేకుండా భవనంలో నిర్మాణాలు సాగాయి. భవనంలో అత్యాధునికమైన హంగులను ఏర్పాటు చేశారు, గతంలో ఎక్కడో చూడని విధంగా ఈ భవనం. ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను కూలగొట్టి మరి ఈ భవన నిర్మాణం చేపట్టడం దారుణం అన్నారు. విశాఖను రాజధానిగా నిర్వహించేందుకు ఇక్కడ ప్రజలు వైసీపీ నాయకులను దారుణంగా ఓడించాలని, రాజధాని వద్దన్న సంకేతాలను ఇక్కడ ప్రజలు ఇచ్చారని జగన్ మోహన్ రెడ్డి గుర్తించారు. 2019 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో తన అడ్డగోలు విధానాలు, నిర్ణయాలతో పాలనను బ్రష్టు పట్టించారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై విసిగి చెందిన ప్రజలు తాజా ఎన్నికల్లో ఘోరమైన ఓటమి ఆయనకు చవి చూపించారు. తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను జగన్మోహన్ రెడ్డి నివేదించకుండా, ప్రజలపై నిందలు వేస్తున్నారని, ఇప్పటికీ ఆయనలో మార్పు రాకపోవడం కోసం అన్నారు.