అక్షర వ్యాపారి రామోజీ రావు!ఈనాడు మాటున మహా సామ్రాజ్య స్థాపనమాటవినని సర్కారుపై కరిత్తిగట్టిన కలంపోటుఅనుకూల ప్రభుత్వాలకు అక్షరాల దండలుఊళ్లకు ఊళ్లను మింగి కట్టిన కోట డి చేసిన నియంత అక్షరయోధుడు.. పాత్రికేయ మహర్షి.. వాణిజ్య మేరునగం.. ప్రపంచ ప్రఖ్యాత ఫిలింసిటీని చెక్కిన విశ్వకర్మ.. ప్రజాబంధువు.. సినీస్రష్ట.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఇవన్నీఒకే ఒక్కరికి తొడిగిన భుజకీర్తులు.. ఆయనే చెరుకూరి రామోజీరావుగారు. ఆయనను అక్షర యోధుడు.. పాత్రికేయ మహర్షి అనడం కంటే పంక్తు వ్యాపారి అంటే సబబేమో. అందమైన అక్షరాలు పేర్చి ఈనాడు మాటున ఆనాటి నుంచి మహా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన బిజినెస్ టైకూన్. మాటవినని సర్కారును కూల్చడం, తన ముందు మోకరిల్లే వ్యక్తులు అక్షర హారతులివ్వడం, అధికార పీఠం ఎక్కడం ఆయనకే చెల్లింది. ఊళ్లకు ఊళ్లను మింగి, నిబంధనలు ఉల్లంఘించి వేల ఎకరాల్లో ఫిలింసిటీ కట్టినా కనీసం ప్రశ్నించని ప్రభుత్వాలు ఆయనకు అండగా నిలబడ్డాయి. నిబంధన’లు అతిక్రమించి మార్గదర్శి చిట్‌ఫండ్ ఫెట్టి ప్రజల డబ్బులు వసూలుచేసిన అడిగే ధైర్యం చేయని ఉత్పత్తి ఆయన వద్ద మోకరిల్లింది.శ్రమదోపిడీ, వెట్టిచారికి కేరాఫ్ అడ్రస్ రామోజీ సంస్థలు. అక్కడ యూనియన్లు.. హక్కులు ఉండవు. ప్రభుత్వాలు ఇచ్చే అక్రెడిటేషన్లు పొందే కనీస హక్కు కూడా ఉండదు. ప్రశ్నించడం.. ఎదిరించడం అనే ఆలోచనే రాకూడదు. చెప్పిన పని చెప్పినట్టుగా చేసి వెళ్లాల్సిందే.. అంతే తప్ప ఎలాంటి డిమాండ్లు రాకూడదు. ఇదీ గ్రేట్ రామోజీ సంస్థల హుకుం. ఈనాడులో పనిచేసే సిబ్బంది ఎవరైనా చనిపోతే కనీసం ఆ సంస్థ గుర్తించింది. పనిచేయండి.. ఫలితం ఆశించొద్దు.. ఫలితం ఆశించాల్సింది నేనొక్కడినే అన్నట్టుగా ఉంటుంది రామోజీ సంస్థల తీరు. అందుకే రామోజీరావు గారు మంచి వ్యాపారి. కొత్త ఆవకాయ పచ్చడిని మార్కెట్లో అమ్మిన.. అక్షరాలు అమ్మడం నేర్చిన గొప్ప వ్యాపారి. లాభమే ఆయన అంతిమ లక్ష్యం. నష్టాలు వస్తే దేనినైనా వధించుకునే వ్యాపారి. విఫుల, అన్నదాత, తెలుగు
18