పాలకొల్లు , జూన్ 18:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామ నాయుడును జూన్ 18 న ఎ.పి.యు.డబ్ల్యు.జే. ప్రతినిధి బృందం కలుసుకున్నది!పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పాలకొల్లు ప్రెస్ క్లబ్ చొరవతో మంత్రి క్యాంపు ఈ భేటీ జరిగింది!
పాలకొల్లు ప్రెస్ క్లబ్ బాధ్యులతో పాటు ఐజేయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏ.పి.యు.డబ్ల్యూ.జే. పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్, కోశాధికారి ముత్యాల శ్రీనివాస్, పాలకొల్లు ప్రెస్ క్లబ్ సభ్యులు మంత్రి డా. నిమ్మలను కలిసిన వారిలో ఉన్నారు!
ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పదిహేను అంశాలు గల వినతిపత్రాన్ని యూనియన్ నాయకులు మంత్రి డా.నిమ్మల రామానాయుడుకు అందచేశారు!సమస్యలను మంత్రికి వివరించారు!
అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ అందించారు, జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేక చట్టాన్ని చేయవలసి ఉంటుంది , వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ కార్డుల ఇన్‌స్టాలేషన్ పటిష్టం, ప్రమాదబీమా సంస్థ తిరిగి ప్రారంభించాలని, అక్రెడిటేషన్ తో నిమిత్తం లేకుండా సీనియారిటీ ప్రాతిపదికన ఉచితంగా ఇంటి స్థలాలు అందించడానికి, విశ్రాంత పాత్రికేయులకు చిన్న పత్రికలకు పింఛను పొందే పద్ధతి , చేయాలని , జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ని తిరిగి ప్రారంభించాలని , ఆ వినతి పత్రంలో వివరాలు!
సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి డా.నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు!
జర్నలిస్టుల సమస్యలపై వివరంగా చర్చించడానికి వీలుగా అనువైన సమయంలో మరోసారి వచ్చి తనను కలుసుకునేందుకు యూనియన్ నాయకులను మంత్రి డా.నిమ్మల ఆహ్వానించారు! మంత్రిని సత్కరించడానికి యూనియన్ ప్రతినిధి బృందం ప్రయత్నించగా ఆయన సున్నితంగా వారించారు!
గత ఐదేళ్లుగా జర్నలిస్టుల సమస్యలపై యూనియన్ పోరాటం చేసిన తనకు తెలుసు, నిజానికి గట్టిగా పోరాడిన యూనియన్ నాయకులను తామే సత్కరించాలని మంత్రి అన్నారు!
ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ ను మంత్రి డా. నిమ్మల రామానాయుడు శాలువాతో సత్కరించారు!