ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఇటీవల రద్దు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
పలు కీలక బిల్లులకు…
దీనితో పాటు పలు కీలక బిల్లులను ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖతో సమావేవమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నివేదించారు. శాఖల వారీగా ఆదాయం, ఖర్చులను కూడా తమకు అందించాలని పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులను నియమించారు.