అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి అమరావతిలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఉద్ధండరాయునిపాలేనికి చేరుకున్న ఆయన.. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన వేదికకు కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని ప్రాంతాన్ని మొత్తం తిరిగి పరిశీలించనున్నారు. 2019 తర్వాత నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించనున్నారు. రాయపూడిలోని మినిస్టర్స్ పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ఒంటి గంటకు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా అమరావతి ఫ్యూచర్ ప్లాన్‌పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టూర్ అయ్యాక రాజధానిలో జరిగిన డ్యామేజీపై ఎంక్వైరీ కమిటీ వేయనున్నారు.