మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా..? అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. ‘వైసీపీకి 26 జిల్లాల్లో 42 ఎకరాలకుపైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు కేటాయించాం. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో పేలస్ లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూ దాహానికి కబ్జా అయిన రూ.600 కోట్లకుపైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వవచ్చు. నీ విలాసాల కోసం పేలస్ ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ పేలస్ లు పిచ్చి. నీ ధన దాహానికి అంతు లేదా’ అంటూ నారా లోకేష్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఈ ట్వీట్‌తో పాటు 26 జిల్లాల్లో వైఎస్‌ఆర్ పార్టీ నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాలకు సంబంధించి నారా లోకేష్ జత చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయాన్ని మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన విషయం తెలిసిందే. ఇతర ప్రాంతాల్లో చేసిన నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు నిర్మాణాలు సాగిస్తున్న భవనాలకు నోటీసులు కూడా అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ తాజాగా ట్విట్ చేశారు. ఈ ట్వీట్‌లో జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాల్లో నామమాత్రపు ధరలకు భూములను పార్టీ కార్యాలయాల కోసం కేటాయించిన, నిర్మాణాలు సాగిస్తున్న షేర్ చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.