ప్రముఖ సినీ నటుడు అలీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత ఇప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయని అలీ.. సాయంత్రం పార్టీకి రాజీనామా చేసినట్టు శుక్రవారం వ్యాఖ్యలు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలీ చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అత్యంత ఆప్తుడిగా పేరుగాంచిన అలీ అ ప్పట్లో వైసీపీలో చేరడం సంచలనంగా మారింది. జనసేనను కాదని వైసీపీలో చేరిన అలీకి అనేక పదవులు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. 2024 సార్వత్రికి ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఎలక్ర్టానిక్ మీడియా సలహాదారుడు పదవితో మాత్రమే అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకానొక దశలో అలీకి రాజ్యసభ పదవిని ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లోనూ వైసీపీ ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. కానీ, వైఎస్ జగన్ ఆయనకు ఎక్కడా సీటు కేటాయించలేదు. అప్పట్లోనే ఆయన పార్టీ మారే అవకాశముందన్న ప్రచారం జరిగింది. కానీ, ఆయన పార్టీలోనే కొనసాగారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది. 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో వైసీపీలో రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో అలీ రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన లేఖను ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పంపించారు. ‘నేను ఏ పార్టీ మనిషిని కాను. ఏ పార్టీకి మద్ధతు పలుకడం లేదు. సామాన్య మనిషిని. ఇకపై పూర్తిగా సినిమాలు చేసుకుంటూనే ఉంటాను’ అని అలీ ప్రకటించారు. రామానాయుడు ప్రోత్సాహంతో నటుడిని అయ్యారని, ఇకపై నటుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. రామానాయుడు ఎంపీగా పోటి చేసిన సమయంలో తనను ప్రచారం చేయమని అడిగారని, ఆయన కోసం టీడీపీలో చేరి 20 ఏళ్లపాటు అదే పార్టీలో కొనసాగుతున్నారన్నారు. తనకు అన్నం పెట్టింది తెలుగు సినిమా పరిశ్రమ అని, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్లు తనకు అన్నం పెట్టారని గుర్తు చేసుకున్నారు. తనకు దయాగుణం ఉన్నందున రాజకీయాలు తోడైతే పది మందికి సాయపడొచ్చన్న ఉద్ధేశంతోనే ఇటువైపు వచ్చానని, నిజంగా రాజకీయాలు చేద్దామని ఇందులోకి రాలేదని. ఈ మేరకు ఒక వీడియోను అలీ విడుదల చేశారు.