అమరావతి, ఈవార్తలు : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఉమ్మడిగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఈ లేఖలో చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సమావేశంలో విభజన సమస్యలను చర్చించుకుంటామని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు రాసిన లేఖలో ఏముందంటే.. ‘తనదైన ముద్ర వేస్తూ పరిపాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు.
మీ చిత్తశుద్ది, నాయకత్వ పటిమ తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న మనం రెండు రాష్ట్రాల సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాలి’ అని సూచించారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు గడిచాయని, పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. పెండింగడ్‌లో కూర్చొని పరిష్కరించుకుందామని చంద్రబాబు. పెండింగ్‌లోని సమస్యలు వల్ల అనేక శాఖల్లో సంక్షేమం, ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతున్నట్టు గుర్తించబడింది. వీటిన్నింటిపైనా మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారాలను తీసుకురావడానికి చంద్రబాబు ఏర్పాటు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన ముఖాముఖి సమావేశంలో చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇరు రాష్ట్రాల లబ్ధి పొందేలా పరస్పరం సహకరించుకోవాలి. మన భేటీ సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.