Nellore School Bus Accident : నెల్లూరు, ఈవార్తలు : ఏపీలోని నెల్లూరు జిల్లా మునునూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సు క్లీనర్ మృతి చెందాడు. మరో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆ స్కూల్ ఆర్ఎస్ఆర్ స్కూల్ కు చెందిన బస్సు అని తెలిసింది. ప్రమాదం సమయంలో స్కూల్ బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, కావలి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే సంఘటనను పరిశీలించి, అనంతరం దవాఖానలో క్షతగాత్రులను పరిశీలించారు. ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. క్లీనర్ చనిపోవటం బాధాకరమని, బాధితులకు మెరుగైన అందించాలని దవాఖాన చికిత్సలను అందించామని తెలిపారు. బస్సుల ఫిట్‌నెట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
19