ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైయస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఎన్నికల్లో గొడవలు, ఈవీఎం పగలగొట్టిన వ్యవహారంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొద్దిరోజుల కిందట అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనను పరామర్శించడానికి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళ్లిసెంట్రల్ జైలుకు వెళ్ళనున్నారు. ఉదయం 9.40 గంటలకు హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలిసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకొని హెలికాప్టర్‌లో తాడేపల్లి వెళ్లనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాకు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే బెంగళూరు పర్యటన ముగించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి వైయస్ భారతి రెడ్డితో కలిసి ఆయన మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లికి చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు దేవినేని అవినాష్, అంబటి మురళీకృష్ణ, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పీ గౌతమ్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు జై జగన్ నినాదాలు చేయడంతో ఎయిర్
15