తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు గుర్తించారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు, ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి జరిగింది. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమల కార్యక్రమం సుమారు 5 గంటల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా తిరుమన కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజారి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతోంది.
16