ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్య, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యలపై జోరుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉందో తెలిస్తే వెంటనే స్పందించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే ఆయన ఫోన్ నెంబర్ విస్తృతంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల వద్దకు చేరింది. ఇదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికర అంశంగా పరిణమించింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చిన ఉద్దేశంతో ఎంతో మంది బాధితులు నేరుగా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. ప్రతిరోజు వేలాదిగా వస్తున్న వాట్సప్ మెసేజ్ లతో మంత్రి నారా లోకేష్ కు ఇబ్బంది ఎదురవుతోంది. వేలాదిగా వస్తున్న మెసేజ్ లతో వాట్సాప్ బ్లాక్ అవుతోందని మంత్రి నారా లోకేష్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రజా సమస్యలు, వినతులను ఇకపై మెయిల్ చేయడానికి మంత్రి లోకేష్ ఈ మేరకు ఒక ప్రకటనలో ఉంచారు. తన వాట్సాప్ ఖాతా తరచుగా బ్లాక్ అవుతుందని, అందుకే తన వ్యక్తిగత ఈ మెయిల్ అడ్రస్ ఇస్తున్నానని, సాయం కోసం వచ్చే ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేష్ ఈ మేరకు పేర్కొన్నారు. పేరు, ఊరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, సమస్య, ఏ సాయం కోరుతున్నారో వంటి వివరాలను వినడానికి
మంత్రి నారా లోకేష్ ఆ ప్రకటనలో
పేర్కొన్నారు. లోకేష్ ఇప్పటికే ఉండవల్లిలోని నివాసంలో ప్రతిరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ఇకపై మెయిల్ ద్వారా కూడా ప్రజల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించనున్నారు. లోకేష్ వాట్సప్ బిజినెస్ ఎకౌంట్ కావడంతో ఫోన్ నెంబర్ల నుంచి పెద్ద ఎత్తున వస్తుంటే తరచూ బ్లాక్ సందేశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. సమస్యలను తెలియజేయాలనుకుంటే [email protected] కు మెయిల్ చేయవలసిందిగా మంత్రి నారా లోకేష్ సూచించారు.