సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని కూటమి నాయకులు గడిచిన ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని కూటమి మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కావాలనే ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి అనగాని సత్య ప్రసాద్ ట్వీట్ చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనితో ప్రభుత్వం అమలు చేయనున్న మరో కీలక హామీగా దీనిని చెప్పవచ్చు. ఇప్పటికే మెగా డీఎస్సీ విడుదలకు సంబంధించి చంద్రబాబునాయుడు తొలి సంతకాని చేయగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పెన్షన్లను కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగువేల రూపాయలకు పెంచడంతోపాటు రెండు నెలలకు సంబంధించిన ఏరియార్సును కూడా ప్రభుత్వం ఈ నెలలో అందించింది. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక ప్రకటన చేయడంతో ఆ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు కూడా
ఆగస్టు 15వ తేదీ నుంచి మరో కీలక ప్రభుత్వం ప్రారంభించబోతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలు చేసిన అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి మళ్లీ ఈ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మూట 183 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి అన్నార్తుల ఆకలని తీర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకేరోజు రెండు కీలక పథకాలను ప్రభుత్వం ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుండడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకేరోజు రెండు కీలక పథకాలను ప్రభుత్వం ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుండడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.