వినుకొండలో రెండు రోజుల కిందట హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళుతున్నారు. జోరు వాన కురుస్తున్నప్పటికీ ఆయన ఈ పర్యటనకు సిద్ధం కావడం లేదు. అయితే, వినుకొండ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనలో జగన్ భద్రతను తగ్గించడంతోపాటు ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈ వాహనం మార్గ మధ్యలోనే మొరాయించడంతో ప్రైవేట్ వాహనంలో వైఎస్ జగన్ వినుకొండ పర్యటనకు వెళుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు చేశారు.
ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు పోలీసులు. జగన్ వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా వెళ్లకుండా అడ్డుకున్నారు. అతి కొద్ది మంది నాయకులకు మాత్రమే జగన్ తో వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనలో భాగంగా రషీద్ ఇంటికి వెళ్ళబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి రషీద్ ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వెంట ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురుకావడాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఖండించారు. నేరుగా వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో గొడవలు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఆయన వెంట కార్యకర్తలు, నాయకులు భారీగా వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.