భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీ నుంచి భారీ వరద వస్త రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేశారు.
ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44 దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 46 అడుగుల వద్ద ప్రవహించింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 48 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. అయితే పైకిన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్త తాజా నది ఉగ్రరూపం దాల్చింది. సాయంత్రం నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.